5.2.26

సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలి - ttd in-charge eo






సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని టిటిడి ఇంఛార్జ్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారువేలాది సంవత్సరాలుగా మన పూర్వికులు అందించిన శాస్త్రంసంప్రదాయాలుసనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారుతిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన అర్చకపరిచారిక మరియు వేదపారాయణందారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.


 సందర్భంగా ఇంఛార్జి ఈవో మాట్లాడుతూటీటీడీ పరిధిలోని వివిధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులుపరిచారకులు మరియు 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారుఅర్చకులుపరిచారకులువేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగానియమబద్ధంగా నిర్వహించేందుకు  పునఃశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


 శిక్షణా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలనిమారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్ అంశాలుసాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయని అన్నారుశ్రీ ఆదిశంకరాచార్యులుశ్రీ రామానుజాచార్యులుశ్రీ మధ్వాచార్యులు వంటి మహనీయులు కాపాడుతూ వచ్చిన సనాతన సంప్రదాయాన్ని భక్తులకుసమాజానికి చేరవేయడంలో  శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు


 తరగతులలో ఆగమ పరిచయంఆగమాలు, వైఖాసనంనిత్య పూజ విధానంపంచసూక్తాలుసంధ్యావందనంగోత్రప్రవరలుఅగ్ని ప్రతిష్టాపనవ్యశేషాంశములుఅష్టోత్తరఆశీర్వచన మంత్రాలుఉచ్ఛరణ సంస్కృత పరిజ్ఞానంకల్యాణోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాలుతిరుమల శ్రీవారి ఆలయ ఉత్సవాలుసంప్రదాయాలుబ్రహ్మోత్సవంఅర్చకుల లక్షణాలువిధులుపవిత్రోత్సవం ప్రాముఖ్యతగృహ అర్చనబింబ ప్రతిష్టవైశిష్ట్యంజ్యోతిష్య శాస్త్రంనిత్యార్చనశిక్షణ నిర్ధారణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారుశిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న వారు ఏమి నేర్చుకున్నారుఇంకా ఏమి నేర్చుకోవాలో తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ సేకరించి తదనుగుణంగా మాడ్యూల్స్  రూపొందించాలని సూచించారు.


అనంతరం వేద విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూఅర్చకులుపరిచారకులువేద పండితులకు శిక్షణా కార్యక్రమాలు తప్పనిసరిగా నిరంతరం నిర్వహించాలన్నారు శిక్షణల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభించడమే కాకుండాభిన్నమైన అభిప్రాయాల పరస్పర మార్పిడి ద్వారా నూతన ఆలోచనలు వెలుగులోకి వస్తాయని వివరించారు.


అటు తర్వాత శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త బ్రహ్మోత్సవానుక్రమణికా పుస్తకాన్ని టిటిడి ఇంఛార్జ్ ఈవో ఆవిష్కరించారుఅనంతరం మానవ నిత్య జీవితంలో వేదాల విశిష్టతనుయోగా ప్రాముఖ్యత తెల్పేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారుతిరుమల ఆలయ తరహాలో టిటిడిలోని అన్ని ఆలయాలలో కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా టిటిడి ఆధ్వర్యంలోని 61 ఆలయాలలో పనిచేసే అర్చక,  పరిచారికవేదపారాయణందారులకు    శిక్షణ పయోగపడనుంది.


 కార్యక్రమంలో టిటిడి శ్రీ వైఖానస ఆగమ సలహాదారు డాభావనారాయణ చార్యులుధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సి పాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్యం అవధానిశ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీ పోకల భాస్కరుడుశ్వేత ఇంఛార్జ్  డైరెక్టర్ శ్రీమతి సువర్ణమ్మడిప్యూటీ ఈవో (జనరల్ ) శ్రీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments