11.2.26

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామిyoga narasimhamam









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.


వాహనం ముందు వృషభాలుగజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


సింహ వాహనం – ధైర్య‌ సిద్ధి


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణశిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారుసింహం పరాక్రమానికిధైర్యానికితేజస్సుకుఆధిపత్యానికిమహాధ్వనికి సంకేతంసింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయిసోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌ స్ఫూర్తి సిద్ధిస్తుందిఅజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేనునా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని  సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.


రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.


వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మివిజివో శ్రీ గిరిధర్ఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌కంకణ భట్టార్

శ్రీ బాలాజి రంగాచార్యులుఅర్చకులుటెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments