1.3.26

చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు no ssd tokens




ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3 తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవు.


మార్చ్ 2, 3 తేదీలకు సంబంధించిన SSD టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2 తేదీల్లో జారీ చేయబడవు.


మరలా మార్చి 4 తేది దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3 తేదిన జారీ చేయడం జరుగుతుంది.


అదేవిధంగా మార్చి 3 తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయడమైనది కారణంగా మార్చి 2 తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


 విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments