23.3.26

శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో కళా వైభవం brahmotsavams







శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై నిర్వహించిన భక్తి సంగీతనృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు జరిగిన గాత్ర కచేరీలో కళాశాల ధ్యాపకురాలు శ్రీమతి కేవందన “నమో నమో రఘుకుల నాయక”, “శర శర సమరైక సూర”, “మరి వేరే దిక్కెవరయ్య రామ”, “దశరథ రామ గోవిందా”, “కోదండరామ కోదండరామ”, “బ్రోవ భారమా” వంటి కీర్తనలను సుమధురంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.


తదుపరి రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు డామోనీషా నవీన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రదర్శనలో “హనుమాన్ చాలీసా”, “కళ్యాణ రామ”, “శ్రీ హరి స్తోత్రం”, “రామ రామ”, “శ్రీ రామచంద్ర కృపలు”, “చిన్నిశిశువు”, “గణపతి భజన్”, “లక్ష్మీ కౌతం”, “ఆండాళ్ కౌతం”, “కృష్ణ కృష్ణ భజన్”, “తిల్లాన” వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


 కార్యక్రమాలు భక్తిసంస్కృతిఆధ్యాత్మికతల సమ్మేళనంగా భక్తులకు అపూర్వానుభూతిని కలిగించాయి.

No comments :
Write comments