22.3.26

రామనామం మార్మోగగా… సంగీతం నర్తించగా… భక్తి పరవశంలో మునిగిన తిరుపతి పురవాసులు cultural events








తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై శనివారం నిర్వహించిన భక్తి సంగీతనృత్య కార్యక్రమాలు క్తులను మంత్రముగ్ధులను చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దాయి.


 కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి వైశ్రీవాణి బృందం అందించిన వీణా సంగీత కచేరి భక్తులను భక్తి రసంలో ముంచెత్తిందిస్వరాల మాధుర్యంతో శ్రీరామ భక్తిని ప్రతిధ్వనింపజేసిన  కచేరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


తదుపరి రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు జరిగిన భరతనాట్య నృత్య ప్రదర్శనలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎంఉమా ముద్దు బాల వారి శిష్యబృందం అద్భుత నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను అలరించింది.


 సందర్భంగా వారు “పుష్పాంజలి”, “శ్రీ విఘ్నరాజం భజే”, “శ్రీరంగపుర విహార”, “జతీశ్వరం”, “శ్రీరామదూత”, “సీతారామ వర్ణం”, “శ్రీరామచంద్ర కృపాలు”, “రామ దశరధ రామ”, “అదివో అల్లదివో”, “తిల్లానా” వంటి నృత్య అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


సంగీతంనృత్యం సమ్మేళనంగా సాగి  కార్యక్రమాలు భక్తుల్లో భక్తి భావాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను మరింతగా ప్రతిబింబించాయి.


No comments :
Write comments