18.3.26

ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల వైభవం -రామ నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగిన ఆల‌యం dhwajavarohanam







తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయిభక్తుల రామ నామ స్మరణతో ఆలయం మార్మోగింది.


కంకణబట్టార్ శ్రీ భ‌ర‌త్ కుమార్ దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారుఅనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలుభక్తుల గోవిందనామస్మరణరామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకువంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.


అంతకుముందు ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారుధ్వజపటముచక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారుఅనంత‌రం ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.


అనంత‌రం ఉదయం 11 నుండి 12.45 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంల‌తో అభిషేకం చేశారు.


కాగారాత్రి 7 నుండి 8.30 గంట‌ వ‌ర‌కు పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.


 కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిడెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్ఆలయ అర్చకులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments