రాష్ట్ర
ముఖ్
యమంత్రివర్యులు
గౌ
|| శ్రీ
నారా
చంద్రబాబునాయుడును
గురువారం
టి
టిడి
అదనపు
ఈవో
శ్రీ
సి
.హెచ్
. వెం
కయ్య
చౌదరి
మర్యాదపూర్వకంగా
కలి
శారు
.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు శేషవస్త్రం, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి గౌ|| రాష్ట్ర గవర్నరు, గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ గౌ|| ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడిని గురువారం టిటిడి ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
గౌ|| ముఖ్యమంత్రిని అమరావతిలోని సిఎం స్వగృహంలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
టిటిడి అదనపు ఈవో వెంట ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు.
No comments :
Write comments