16.4.26

మే 01 నుండి 09 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరసముతో విరాజిల్లనున్న దివ్య ఉత్సవాలు delhi temple




శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 01 నుండి 09 తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఉత్సవాలకు ఏప్రిల్ 30 అంకురార్పణం జరుగనుంది.


బ్రహ్మోత్సవాల ముందు భాగంగా ఏప్రిల్ 28 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధినిర్వహిస్తారుమే 01 తేదీ రాత్రి 09.00 గంటల నుండి 10.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకురాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయిమే 10 తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పుష్పయాగం నిర్వహించబడుతుంది.


వాహన సేవల వివరాలు 

🔸 01-05-2026 – ఉదయం ధ్వజారోహణంరాత్రి పెద్దశేష వాహనం

🔸 02-05-2026 – ఉదయం చిన్నశేష వాహనంరాత్రి హంస వాహనం

🔸 03-05-2026 – ఉదయం సింహ వాహనంరాత్రి ముత్యపు పందిరి వాహనం

🔸 04-05-2026 – ఉదయం కల్పవృక్ష వాహనంరాత్రి సర్వభూపాల వాహనం

🔸 05-05-2026 – ఉదయం మోహినీ అవతారంసాయంత్రం కల్యాణోత్సవంరాత్రి గరుడ వాహనం

🔸 06-05-2026 – ఉదయం హనుమంత వాహనంరాత్రి గజ వాహనం

🔸 07-05-2026 – ఉదయం సూర్యప్రభ వాహనంరాత్రి చంద్రప్రభ వాహనం

🔸 08-05-2026 – ఉదయం రథోత్సవంరాత్రి అశ్వ వాహనం

🔸 09-05-2026 – ఉదయం చక్రస్నానంరాత్రి ధ్వజావరోహణం


 దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.

No comments :
Write comments