16.4.26

సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు భక్తులకు టీటీడీ విజ్ఞప్తి appeal to devotees




ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలుగ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.


దీనిలో భాగంగా నిన్న టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతోపోలీసు స‌మ‌న్వ‌యంతో సోషియ‌ల్ మీడియాలో "శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌తిరుప‌తి వెంకటేశ్వ‌ర స్వామి దేవ‌స్థానంఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరుజిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజుబోడిరెడ్డి చెన్న‌కేశ‌వులు అనే వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించ‌డం జ‌రిగేలా చేయడం జరిగింది.


ఇటీవ‌ల సోషియ‌ల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోందిటీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలుగదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరడమైనది.


ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని భ‌క్తుల‌ను కోర‌డ‌మైన‌దిఅలాంటి వ్య‌క్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెంః9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా తెలియ‌జేయ‌డమైన‌ది.

No comments :
Write comments