28.4.26

మే2 నుండి 8 వరకు వైభవంగా పదకవితా పితామహుడు అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు annamcharya




సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 618 జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ‌ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయిఅన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరంరాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ద్దతిరుపతిలోని మహతి కళాక్షేత్రంఅన్నమాచార్య కళామందిరంల‌లో జయంతి కార్యక్రమాలను  నిర్వహించనున్నారు.


తాళ్లపాకలో..


తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మే 2 తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయిమొదటగా న్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వ‌హిస్తారుఅనంత‌రం ఉద‌యం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం క‌న్నుల పండుగ‌గా జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల రకు గాత్ర సంగీతంహరికథనృత్యనాటక ప్ర‌ద‌ర్శ‌న‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


రాజంపేట‌లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2 తేదీ సాయంత్రం 6.30 గంట‌లకు ఊంజల్ సే జ‌రుగ‌నుందిఅదేవిధంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీతవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.


తిరుపతిలో..


తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2 తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయిఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.


మే 3 నుండి 7 తేదీ వ‌ర‌కు ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయిమే 8 తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారుఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 1 గం వ‌ర‌కు సంగీత స‌భ‌హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.  


ఇందులో భాగంగా మే 2 నుండి 8 తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతంనృత్యవాద్య‌హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


మహతి కళాక్షేత్రంలోనూ మే 2 నుండి 8 తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత,  నృత్యవాద్య‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.  


భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల సౌరభాన్ని ఆస్వాదించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.


No comments :
Write comments