23.5.25

Thug Life Movie Press meet-01

































 

TTD Chairman Offers Pattu Vastrams to Japali Hanuaman






On the auspicious occasion of Hanuman Jayanti, TTD Chairman Sri B.R. Naidu on Thursday offered Pattu Vastrams on behalf of TTD to the famous Japali Anjaneya Swamy at Japali Theertham in Tirumala.


Upon his arrival at the temple, the Chairman was welcomed by the priests, who facilitated him darshan of Japali Hanuman. 

After performing special pujas to the deity, the priests honoured the Chairman with Sindhoora vastram and offered Theertha Prasadams.

Speaking to the media on this occasion, the TTD Board Chief said that offering Pattu Vastrams to Japali Hanuman on Hanuman Jayanti is a long-standing tradition. 

He said he prayed Sri Japali Hanuman to bestow His blessings upon all the devotees.

VGO Sri Surendra, Health Officer Dr. Madhusudan, and other officials participated in the event.

జాపాలి హనుమాన్ కు టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పణ









హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరుపున చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ఉదయం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో చైర్మన్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర, ఆరోగ్యాధికారి శ్రీ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మే 23 నుండి నుండి 28వ తేదీ వరకు శ్రీ కలిగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ




టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ మే 23 నుండి 28వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మే 23వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 గం.ల వరకు ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం, హారతి జరుగనుంది.

ఇందులో భాగంగా మే 24వ తేదీ ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు యాగశాల వాస్తు, అకల్మషహోమం, రక్షాబంధనం, సాయంత్రం 06 నుండి 8.30 గం.ల వరకు అగ్ని ప్రతిష్ట, కళాకర్షణ, ఉక్త హోమాలను నిర్వహించనున్నారు. మే 25వ తేదీ ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు పంచగవ్యాదివాసం, క్షీరాధి వాసం, యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి , సాయంత్రం 06 గం.ల నుండి 8.30 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి జరుగనుంది.
మే 26వ తేదీ ఉదయం 09 గం.టల నుండి 12 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన శిఖర స్థాపన, బింభస్థాపన, అష్టబంధన, ద్రహ్యారాధన సమర్పణ, హారతి, సాయంత్రం 06గం.ల నుండి 8.30 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమములు, హారతిని నిర్వహించనున్నారు. మే 27వ తేదీన ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, బింభవాస్తు, చతుర్థశ నవకలశ స్థాపన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, హారతి, సాయంత్రం 06 నుండి 8.30 గం.ల వరకు మహాశాంతి హోమాలు, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం, శయనాది వాసం, హోత్ర ప్రశంసనము, విశేష హోమాలు జరుగనున్నాయి.
మే 28వ తేదీన 05 గం.ల నుండి 06.15 గం.ల వరకు సుప్రభాతం, యాగశాల వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షణ, ఉదయం 07 గం.ల నుండి 07.30 గం.ల వరకు కళావాహన, ఆరాధన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ఆచార్య బహుమానం, ధ్వజారోహణం, హారతి , సాయంత్రం 04 గం.ల నుండి 07 గం.ల వరకు కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణం జరుగనుంది.

కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్





శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఛైర్మన్ చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్ కు జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్, జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్, పలువురు స్థానిక నేతలు స్వాగతం పలికారు. 

TTD Chairman Paves Visit To Sri Anjaneya Swamy at Kullur







The TTD Chairman Sri BR Naidu visited Anjaneya Swamy at Arama Maruthi Nilaya Sanctuary in Kullur, Kaluvai Mandal, Nellore District on Thursday. 


Earlier, upon his arrival to the temple, the temple priests gave him a traditional Poornakumbha welcome. 

On the occasion of Hanuman Jayanti, TTD Chairman Sri BR Naidu visited Anjaneya Swamy on the invitation of local former MLC Madasu Gangadhar. 

On this auspicious occasion, the TTD Chairman, who reached the temple, was welcomed by District Collector Sri Anand, District SP Sri Krishna Kant and several other local leaders. 

మే 24న‌ ‘డ‌య‌ల్ యువ‌ర్




టిటిడి నిర్వహించే ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మం మే 24వ‌ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భవనంలో జరగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.


ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.