5.6.25

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి










తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంతతేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడైన శ్రీ వేంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు.

అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 - 06.00 గంటల వరకు ఊంజల్ సేవ  వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ముత్య‌పుపందిరి వాహనంపై శ్రీ గోవిందుని అభయం













తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవిందరాజస్వామివారు ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి
నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.
వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 

4.6.25

Donation to SV Prasadana Trust




Mangaluru-based Srivari devotee Smt Vidya Ravichandran donated Rs. 54lakh to the SV Pranadana Trust of TTD.

The donor handed over the DD for the same to  TTD Additional EO Sri Ch Venkaiah Chowdary on Tuesday.

శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు



తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన వెళ్లే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని టిటిడి నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం వర్చువల్ మీటింగ్ ద్వారా టిటిడి అధికారులతో చర్చించారు.

శ్రీవారి మెట్టు నుండి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లు తీసుకునే దివ్యదర్శనం భక్తులు తదుపరి శ్రీవారి మెట్టు వద్ద నుండి తిరుమలకు కాలినడకన శనివారం శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం నుండి ఏ రోజు కారోజు భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం భక్తులు టోకెన్లు తీసుకుని మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ల జారీ కోసం ప్రత్యేకంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దివ్య దర్శనం టోకెన్ల కోటా లభ్యత ప్రకారం ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన ఆధార్ కార్డులతో టోకెన్లు పొందాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లను స్కాన్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టిటిడి సీనియర్ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని, టోకెన్ల జారీలో ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ల జారీని మార్చే అంశంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాఖల వారీగా శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, టీటీడీ ఇన్‌చార్జి సీవీఅండ్ఎస్‌వో, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్‌రాజు, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈలు శ్రీ మనోహరం, శ్రీ వెంకటేశ్వరులు, జీఎం(ఐటీ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, శ్రీ గోవింద రాజన్ ,శ్రీ సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Temporary Counters at Bhudevi Complex for the Issuance of Srivari Mettu DD Tokens




To overcome the traffic and crowd management issues and for an operational ease, TTD has decided to shift on temporary basis the issuance of Divya Darshan (DD) tokens at Srivari Mettu to Bhudevi Complex in Tirupati, which will come into force from Friday evening onwards.


In this regard, a virtual meeting by TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary and other officials was held on Tuesday evening which discussed in length on the arrangements to be made on June 06 at the counters which are erected separately to issue Srivari Mettu DD tokens exclusively to the pilgrims.

Some Excerpts from the meeting:

The Srivari Mettu DD tokens will be issued simultaneously along with the Tirupati SSD tokens a day before for Darshan on next day in the exclusive counters earmarked for them.

The devotees who procured the Srivari Mettu DD tokens with their Adhaar Cards on first come first basis as per the availability of the tokens quota shall have to scan the token at 1200th step along Srivari Mettu.

TTD Vigilance and Security in coordination with the district Police have to ensure security measures to avoid any untoward incident

A team of officers will be deputed to vigil the issuance of tokens in a smooth manner at the Bhudevi Complex. They should carry out continuous inspections and ensure a hassle-free atmosphere near the token counters

A wide Publicity on the temporary shifting of the Srivari Mettu DD token counters to Bhudevi Complex needed Engineering, Annaprasadam, Health (Sanitation) departments to make necessary arrangements in the larger interests of the devotees and properly utilize the services of Srivari Seva volunteers.

Tirupati JEO Sri Veerabrahmam, TTD In-charge CV&SO and Tirupati Urban SP Sri Harshavardhan Raju, CE Sri Satyanarayana, SEs Sri Manoharam, Sri Venkateswarulu, GM(IT and Transport) Sri Sesha Reddy, DyEOs Sri Lokanatham, Sri Somannarayana, Sri Selvam, Additional HO Dr Sunil, VGOs Smt Sadalakshmi, Sri Ramkumar, Sri Surendra and other officials were also present.

Chinna Sesha Vahanam Held







Chinna Sesha Vahana Seva was observed in Tirupati as a part of ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple on Tuesday morning.


Along with Sridevi and Bhudevi, Sri Govindaraja Swamy graced the five hooded divine serpent carrier, believed to be Vasuki.

Both the Pontiffs of Tirumala, DyEO Smt Shanti, other temple officials, devotees were also present.

చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసం











తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటలకు వాహనసేవ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.


కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

చిన్నశేష వాహనం ”వాసుకి” గాను భావించవచ్చును. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం – శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తున్నది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుంది.

కాగా సాయంత్రం 5.30 - 06.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి 7.00 గంటల నుండి 9.00గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సో హం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెదజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.