అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 10.30 - 11.00 గంటల వరకు సింహలగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది.
శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు.
TTD EO Sri J. Syamala Rao instructed officials to complete all the ongoing construction works within stipulated timelines for the convenience of pilgrims.
In a review meeting held along with the Additional EO and various Department Heads at the Administrative Building in Tirupati on Saturday, he stressed regular monitoring and strict supervision by the engineering officials.
The EO directed enhanced vigilance on fake ticket sales, middlemen, and corruption, and suggested expanding Alipiri Toll Gate, with modern security equipment and improved surveillance.
Departments were asked to study airport-level facilities and submit a report.
The EO also suggested setting up a cold storage facility at the marketing Godown for storing cooking materials for Annaprasadam and more facilities to devotees at Kalyanakattas.
He also reviewed temples development including Tiruchanoor, Kapilatheertham, Narayanavanam, Nagulapuram, Amaravati, Vontimitta, and Tirumala areas like Papavinasanam and Silathoranam, and sought updates on new temples at Navi Mumbai, Bandra, Yanam, Anantavaram, and Ulundurpetai.
The meeting was attended by JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, FA & CAO Sri Balaji, and CE Sri Satyanarayana and other officers.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలసి శనివారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారులలో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టిటిడిలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టిటిడి సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కొరకు ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ వుంచే వంటసామాగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెస్ లో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, శ్రీ కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని పాపవినాసం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యానం, అనంతవరం, ఉల్లందూర్ పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, శ్రీ టివి సత్యనారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
The annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy at Tallapaka in Annamayya district began on Saturday with Ankurarpanam.
For Sri Siddheswara Swamy, Dhwajarohanam will be held on July 6 at 6.16 AM, followed by daily vahana sevas including Hamsa, Chandra Prabha, Simha, Nandi, Gaja Vahanam, and Parveta Utsavam. Arjita Kalyanotsavam will be on July 11 and Pushpayagam on July 15.
For Sri Chennakesava Swamy, Dhwajarohanam is on July 6 between 9 to 10 AM in Simhalagna. Vahana sevas include Sesha, Hamsa, Simha, Hanumantha, Garuda, Gaja, Ashwa, and Rathotsavam. Arjita Kalyanotsavam will be on July 11, Chakrasnanam on July 14, and Pushpayagam on July 15.
TTD’s HDPP and Annamacharya Project will organize spiritual and cultural programs daily.
Officials and priests participated in the inaugural events.
టిటిడికి అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంకుర్పాణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం 05.00 గం.లకు, శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో సాయంత్రం 06.00 గం.లకు అంకురార్పణ జరిగింది.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :
జూలై 06వ తేదీ ఉదయం 06.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 10న ఉదయం పల్లకీ సేవ, రాత్రి నంది వాహనం సేవ చేపడుతారు. జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 07.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 13న రాత్రి 6.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 - 12.00 గంటలకు వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 05.00 - 06.00 గం.ల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 09.00 గం.లకు స్నపన తిరుమంజనం, రాత్రి 06.00 - 08.00 గం.ల మధ్య పుష్పయాగం చేపడుతారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం 09.00 గం.లకు మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ నిర్వహిస్తారు.
జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 12న సాయంత్రం 06.00 - 08.00 గం.ల మధ్య రథోత్సవం, జూలై 13న రాత్రి అశ్వవాహనం, జూలై 14న ఉదయం 09.30 - 10.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ బాలాజీ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.