4.8.25

ఏఐ విధానంపై మాజీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఖండించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుTTD Chairman




టిటిడిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేయాలనే అంశాన్ని తప్పుబడుతూ మాజీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఖండించారు.


తిరుమలలో శ్రీవారి  క్యూ కాంప్లెక్సులలో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని  ఉచితంగా గూగుల్ / టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నిర్దేశించిన సమయం లోపు  భక్తులకు దర్శనం  కల్పించాలని టిటిడి పాలకమండలి చర్చించి నిర్ణయించిందని టిటిడి ఛైర్మన్ తెలిపారు.

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిర్దేశించిన సమయానికి కల్పించేందుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ విధానాన్ని అమలుకు నిర్ణయించామన్నారు.

భక్తులకు శ్రీవారి దర్శన సమయం ముందుగా తెలియడం ద్వారా భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్ లలో వేచియుండకుండా ఇతర ఆలయాలను సందర్శించేందుకు వీలుగా  టిటిడి పాలక మండలి నిర్ణయించిందన్నారు.  

ఇలాంటి సమయంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి,  టిటిడి మాజీ ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం  బాధాకరమని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఖండించారు.

ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళం సృష్టేంచేలా ఉన్నాయన్నారు.

దాతల సహాయంతో టిటిడిలో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని ఛైర్మన్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి సేవలను సులభతరం చేస్తుంటే, అదే పద్దతిలో ఏఐ టెక్నాలజీ ద్వారా టీటీడీలో కేవలం దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేసేందుకు, మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు మాత్రమే ఉపయోగించేలా నిర్ణయించామన్నారు.

వాస్తవాలు ఇలా ఉండగా ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు.

ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు Pavitrotsavams




తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.


పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు

ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 4న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగ‌స్టు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.

3.8.25

Union Minister Offers Prayers






Union Minister for Road Transport and Highways of India Sri Nitin Gadkari offered prayers in the Tiruchanoor temple on Saturday.


After Darshan of Sri Padmavati Ammavaru he said he prayed the Goddess to bestow prosperity and happiness among the citizens of the country.

AP Minister for Transport Sri Ramprasad Reddy, TTD EO Sri J Syamala Rao, board member Sri Bhanu Prakash Reddy, DyEO Sri Harindranath, and others were present.

దేశం సుసంపన్నంగా ఉండాలి - కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి Central Minister










కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శనివారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని  అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ  తెలిపారు. 

ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ ఎం. రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

అమ్మవారి వేద పండితులు వేద ఆశీర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో గౌ|| కేంద్ర మంత్రికి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను కేంద్ర మంత్రికి అందచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Teppotsavam in Karvetinagaram




The annual Teppotsavams of Sri Venugopala Swamy will be held at the ancient Karvetinagaram temple from August 6 to 8.


On August 6, the processional deity of Sri Venugopala Swamy in the guise of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana will bless devotees on the float. 

On August 7 and 8, Sri Venugopala Swamy along with Rukmini and Satyabhama will take a celestial ride in the temple tank on the finely decked float from 6.30 PM to 8 PM.

Each day, Snapana Tirumanjanam will be held between 9.30am and 10.30am, followed by a Tiruveedhi Utsavam from 5PM to 6.30 PM. 

Spiritual and devotional music programs will also be conducted by HDPP and Annamacharya Projects of TTD during this three day festival.

Gold Tulasi Mala Donated




A devotee from Bengaluru has donated a golden Tulasi mala to Sri Kodandarama Swamy Temple in Tirupati on Saturday.


The Mala, weighing around 257 grams and valued at ₹26 lakhs, is engraved with Gayatri Bijaaksharas on each Tulasi leaf. 

The donor handed over the ornament to the temple Deputy Executive Officer, Smt. Nagaratna.

Temple Chief Priest Sri Anand Kumar Deekshitulu, Temple Inspector Sri Suresh, and other officials participated in the event.

శ్రీ కోదండరామస్వామివారికి బంగారు తులసి హారం బహుకరణ gold tulasi mala

 




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. 


రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.