As part of the annual float festival of Sri Venugopala Swamy at Karvetinagaram, on the second day on Thursday, the deity along with His consorts Sri Rukmini and Sri Satyabhama, were taken in a grand procession on the temple float to bless the devotees.
Special rituals were conducted in the temple on this occasion.
The event was attended by Temple AEO Sri Ravi, Superintendent Sri Muni Shankar, other officials, and a large number of devotees.
The empty plastic tins used for packing cashew nuts at the Tirumala Srivari Temple and other associated temples will be put up for e-auction on August 13 through the Andhra Pradesh Government e-Procurement portal.
For further details, interested parties may contact:
TTD Marketing Office, Tirupati
Phone: 0877-2264429 (During office hours on working days)
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్‌లు ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం స్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తెనే, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.
ఆగష్టు 08న శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు గురువారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
తొలి రెండురోజుల్లాగానే గురువారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పేష్కార్ శ్రీ రామ కృష్ణ, తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందింది.
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ తో కలిసి దాత సికెపిసి ప్రాపర్టీస్ ఎండి శ్రీ చిరాగ్ పురుషోత్తం ఈ మేరకు విరాళం డిడిని టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు అందజేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎందరో పేద రోగులకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్న టిటిడి ఔదార్యాన్ని దాత కొనియాడారు.
గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది పేదలకు ఉచిత సేవలందిస్తున్న ఇలాంటి గొప్ప ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేసినందుకు దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు.
తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చతుష్టర్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 09వ తేదీ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుదీర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.