9.8.25

బిసిబేళా బాత్ | Bisi Bela Bath https://youtu.be/tk0CBI0lQyA

బిసిబేళా బాత్ | Bisi Bela Bath

https://youtu.be/tk0CBI0lQyA

తిరుపతి ఎస్పీడబ్ల్యూ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో డి ఫార్మసీ అడ్మిషన్లకు (D.Pharm) ప్రవేశాలు Sri Padmavati Women's Polytechnic College




తిరుపతి శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీకి ISO సర్టిఫైడ్, NBA అక్రెడిటెడ్, PCI అప్రూవ్ మరియు SBTET గుర్తింపు ఉంది. 


సదరు కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు 09 ఆగష్టు 2025 నుండి 19 ఆగష్టు 2025 వరకు దరఖాస్తులు  స్వీకరించబడతాయి. 

ఆసక్తి గల విద్యార్థినులు ఇంటర్మీడియట్‌లో MPC లేదా BIPC ఉత్తీర్ణత సాధించిన వారు  నేరుగా దరఖాస్తు చేయాలి. విద్యార్థినులకు ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యం కల్పించబడుతుంది.

మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్లను సంప్రదించండి: 9299008151, 9247575386, 8978993810

Tondamanpuram Fest




The annual of Pavitrotsavams was observed with a celestial manner in Tondamanadu. 


Pavitra Samarpana was performed in a sacred manner.

Temples officials, devotees were present.

Maiden Varalakshmi Vratam Observed






The maiden Varalakshmi Vratam went off in a colourful manner in Sri Venugopala Swamy temple in Karvetinagaram on Friday.


Temple staff and devotees were present.

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం golden chariot












తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.


మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

స్వర్ణరథోత్స‌వంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు,  సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Sowbhagyam Observed with Grandeur







The TTD temples located in the states of AP and TS have observed Sowbhagyam with grandeur on Friday in connection with the auspicious Varalakshmi Vratam.

 
The devotees especially women folk are delighted to receive the sacred items kit distributed by TTD that included Kumkum, Pasupu Darams, Kankanams, bangles etc.

టిటిడి అనుబంధ ఆలయాలలో ఘనంగా సౌభాగ్యం Sowbhagyam observed











టిటిడి మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగష్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 52 టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో సౌభాగ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 


ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజులు,  పసుపు, కుంకుమ‌, అక్షింతలు, పుస్త‌క ప్ర‌సాదాలు  అందించారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని టీటీడీకి ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు,  కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించారు. తిరుచానూరు, నారాయణవనం , శ్రీకాకుళం, కార్వేటినగరం, దేవుని కడప, ఒంటిమిట్ట, హైదరాబాద్, సీతంపేట, పిఠాపురం, కీలపట్ల, అనంతవరం, రాజాం, సరిమల్లె, అమరావతి, విజయవాడ తదితర 52 ఆలయాల్లో  సౌభాగ్యం కార్యక్రమం కింద సౌభాగ్యవతులకు గాజులు, కుంకుమ, పసుపు దారాలు, కంఃణాలను స్థానిక అధికారులు, శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. 

దాతల సహకారంతో  8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను  అందించారు. ఆయా ఆలయాలకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.