సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తున్నాయని, దీని ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు. తిరుపతిలోని 23 పార్కింగ్ ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
4200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
ముఖ్యమంత్రి, రాజ్యాంగపరమైన అధినేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
వీలైనంత వరకు సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Bengaluru-based Tivolt Electric Vehicles Pvt. Ltd. donated a Montra Electric Aviator (e-SCV) vehicle worth Rs. 15,94,962 to TTD on Monday.
On this occasion, representatives of the company performed special puja for the vehicle in front of the Srivari temple and handed over the keys to Tirumala temple Deputy EO Sri Lokanatham.
TTD Board member Sri Bhanu Prakash Reddy participated in this program.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం (రచన) విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు.
కాగా రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవాదాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంగళగిరికి చెందిన శ్రీ మన్యం శ్రీనివాసరావు అనే భక్తుడు సోమవారం తన కుమార్తె మన్యం హారిక పేరు మీదుగా టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, మరో కుమార్తె మన్యం హరిత పేరు మీదుగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి పాల్గొన్నారు.
In view of the ensuing annual Srivari Brahmotsavam in Tirumala from September 24 to October 02, under the instructions of the TTD Chief Vigilance and Security Officer Sri Muralikrishna and Tirupati District SP Sri Subbarayudu, the TTD Vigilance and Security sleuths, Health staff along with Tirumala police on carried out a special drive to evict unauthorized persons and beggars in Tirumala on Sunday.
The Beggars and illegal traders who have been staying for a long time at the sheds near Kalyanakatta and SV Shopping Complex were evicted from Tirumala.
The police, TTD Vigilance, Health & Sanitation officials identified 82 unauthorized traders who were doing business without any permits and beggars who have been staying here for a long time and of them were sent down from Tirumala and the fingerprints of the suspects were also checked.
On this occasion, the police made some suggestions to the owners of local hotels, tea shops and retail shops to provide adequate accommodation and facilities to those working for them.
They instructed that after the completion of the day's work, they should be accommodated in Tirupati and not in Tirumala.
A similar joint drive was conducted last month and 75 people were sent down, and such programs will be conducted frequently in the future to remove suspects, unauthorized traders, and beggars menace from Tirumala.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుండి తరలిచేందుకు టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ మురళీకృష్ణ మరియు తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ మరియు తిరుమల పోలీసుల
సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి కిందకు పంపించారు. అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు.
స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరుమలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని పోలీసులు సూచించారు.
గత నెలలో కూడా ఇలాంటి డ్రైవ్‌లో 75 మందిని తరలించగా, ఇకపై కూడా నిరంతరం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ అధికారులు పాల్గొన్నారు.
TTD Trust Board Chairman Sri BR Naidu along with EO Sri Anil Kumar Singhal, accompanied by the Additional EO Sri Ch Venkaiah Chowdary and CVSO Sri Muralikrishna, inspected the four mada streets in Tirumala on Sunday evening.
Later briefing the media persons the Chairman said, as ensuing annual brahmotsavams are scheduled from September 24 to October 02, inspection is being carried out to oversee the ongoing arrangements for the mega religious fete.
He said this year elaborate illumination and flower decorations besides setting up over 30 plus LED screens to display live telecast of Vahana Sevas and other brahmotsavam related rituals will be done for the sake of pilgrims.
Earlier the Chairman and the top brass officials of TTD along with the heads of various departments inspected East, South, West and North mada streets to oversee the arrangements in galleries, Harati points, toilets and mobile toilets in various galleries that are arranged for the comfort of the devotees and many more.
Chief Engineer Sri Satyanarayana, EE Sri Subramanyam, VGOs Sri Ramkumar, Sri Surendra, DyEOs Sri Lokanatham, Sri Rajendra Kumar, Sri Somannarayana and other officers were also present.