తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 24 నుండి అక్టోబరు 02వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు'', అని తెలిపారు.
పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు'', అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
The TTD Trust Board under the chairmanship of BR Naidu extended best wishes to the TTD EO Sri Anil Kumar Singhal who has taken charge as TTD EO for the second time.
The TTD board Chief and other members welcomed the EO on his maiden board meeting and said they will cooperate in every way. They also wished that his past experience as EO will be useful to take forward TTD in a progressive way by providing better services to the devotees.
Reciprocating his wishes to the TTD board, the EO thanked the Honourable CM of AP Sri N Chandrababu Naidu for providing him an opportunity for the second time as TTD EO. ''I will take all your suggestions and strive to serve the devotees to provide better services,'', he asserted.
Earlier, the Chairman and board members also felicitated TTD EO on the occasion.
టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో సమావేశమైన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది.
టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన ఈఓకు టిటిడి చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఈఓగా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు.
టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి సూచనలను తీసుకుని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు.
అంతకుముందు టిటిడి చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను సన్మానించారు.
TTD has all set to change the allocation system of Angapradakshinam tokens from the existing FIFO (First In First Out) method to a Lucky Dip system of allotment.
Henceforth, Angapradakshinam tokens will be released online through the Lucky Dip system three months in advance.
For the month of December, devotees must register for the Lucky Dip between September 18 and 20. Tokens will be allotted only to those devotees who are selected through this Lucky Dip process.
Except on Fridays, 750 tokens will be issued daily, while 500 tokens will be issued on Saturdays.
To re-avail the Angapradakshinam again, the time period has been extended from 90 days to 180 days.
TTD appeals to all devotees to take note of this change and book Angapradakshinam tokens accordingly.
TTD Chairman Sri BR Naidu announced that extensive arrangements are being made for the Srivari Salakatla Brahmotsavam in Tirumala.
TTD trust board meeting under the chairmanship of Sri BR Naidu was held at Annamayya Bhavan in Tirumala on Tuesday.
Later, the Chairman, along with TTD EO Sri Anil Kumar Singhal, explained the decisions taken in this meeting during the media conference.
Highlights of the meeting:
• Srivari Salakatla Brahmotsavams will be held in Tirumala from September 24 to October 02. Extensive arrangements for the convenience of the devotees are underway.
• Srivari Brahmotsavams will begin on the 23rd of this month with the Ankurarpanam. The ceremonious flag hoisting-Dhwajarohanam will be held at the Meena Lagna between 05.43 pm and 06.15 pm on September 24.
• As part of the Brahmotsavams, on September 24, the Honourable Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu will offer silk vastrams to Sri Venkateswara Swamy on behalf of the state government.
-Elaborate arrangements in the wake of the Chief Minister's visit. The Chief Minister will participate in the Pedda Sesha Vahanam of Srivaru at 9 pm on the same day.
- On September 25, Chief Minister Shri Nara Chandrababu Naidu will inaugurate PAC-5 Sri Venkatadri Nilayam.
• Similarly, the Chief Minister will unveil the calendars and diaries for the year 2026.
-During this year Brahmotsavams, steps have been taken to count the number of devotees by involving ISRO and L & T teams.
• To impress the devotees on the occasion of Brahmotsavam, grand flower decorations, arches, and large LED screens are being installed in all the main places.
- On the occasion of Brahmotsavams special darshans for the disabled, elderly, NRIs and parents with infants remains cancelled from 23rd of this month to 02nd of October. Break darshans have been restricted to protocol dignitaries only.
• A buffer stock of 8 lakh laddus available every day.
• On the occasion of Garuda Seva on 28th of this month, the movement of two-wheelers to Tirumala stands cancelled from 9 pm on September 27 to 6 pm on September 29. Similarly, the Alipiri and Srivari Mettu walking paths will remain open round the clock on September 28.
-Additional CCTV cameras will be installed in crowded areas of Tirumala.
• Geo-tagging for the sake of children not to get lost during Brahmotsavam.
- Steps to ensure uninterrupted power supply during Brahmotsavam.
• Live broadcast in HD quality so that devotees from all over the world can watch the Vahana sevas
• four lakh buttermilk packets to devotees on Garuda Seva.
-Fruit and flower, a photo exhibition in Tirumala to impress the devotees.
Other important decisions
• Approved the construction of Sri Venkateswara Swamy temple in 7 acres of land in Kolikoppa village in Belagavi, Karnataka state with funds from TTD Srivani Trust.
• In Sri Venkateswara Swamy temple in Anantavaram village, Tullur mandal, Guntur district, it has been decided to undertake the development of a Rajagopuram, Mukha Mandapam, ornaments for Sri Subrahmanya Swamy, as well as drinking water facilities, toilets and other development programs in the temple in phased manner at a cost of Rs. 7.20 crore.
- It has been decided to undertake Rs. 5.73 crore for the development of Sri Pattabhirama Swamy Temple Pushkarini, Kalyana Vedika Rajagopuram, and other development works in Valmikipuram, Annamayya District, and Rs.1.50 crore for the reconstruction of Sri Lakshminarasimha Swamy Temple Pushkarini in Tarigonda.
- Sri Badri Venkata Reddy and Sri Badri Vishnuvardhan Reddy from Hyderabad have donated 0.74 cents of land worth Rs. 89.54 lakhs in Survey No. 141-2, Kaja village, Mangalagiri mandal, Guntur district to TTD. Approval has been given to accept the said land.
• Similarly, as per the orders of Chief Minister Sri Nara Chandrababu Naidu, it has been decided to construct 1000 temples in Dalit colonies across the state in the first phase.
• Criminal cases will be registered against those who spread misinformation about TTD.
TTD Board Members, Additional EO Sri Ch Venkaiah Chowdary, and other officials participated in this meeting.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం చైర్మన్ అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది.
అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.
- ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము నిర్వహించడం జరుగుతుంది.
- బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రిగారి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొంటారు.
- సెప్టెంబరు 25వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిఏసి- 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు.
- అదేవిధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరిస్తారు.
- ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాట్ లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టాం.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చిలు, ఎల్ఇడి తోరణాలు, అన్ని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎల్ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం.
- ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.
- ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయి.
- తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్లో అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సవాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాం.
- తిరుమలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఫల పుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం.
- అదే విధంగా, కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని కొలికోప్ప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో 7 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆమోదించాం.
- గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ. 7.20 కోట్లతో రాజగోపురం, ముఖ మండపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో తాగు నీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు దశలవారిగా చేపట్టేందుకు నిర్ణయం.
- అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కల్యాణ మండపం తదితర అభివృద్ధి పనులకు రూ.5.73 కోట్లు, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం.
- హైదరాబాద్‌కు చెందిన శ్రీ బద్రి వెంకటరెడ్డి, శ్రీ బద్రి విష్ణువర్ధన్ రెడ్డిలు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబరు 141-2లో రూ.89.54 లక్షల విలువ చేసే 0.74 సెంట్ల స్థలాన్ని దాతలు టీటీడీకి విరాళంగా అందించారు. సదరు భూమిని స్వీకరించేందుకు ఆమోదం.
• అదేవిధంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొదటి దశలో రాష్ట్రంలోని దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం.
• టిటిడిపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ ఎం.ఎస్.రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నర్సిరెడ్డి, శ్రీ సదాశివరావు, శ్రీమతి జానకి దేవి, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీమతి రంగశ్రీ ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్–2025ను విడుదల చేశారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం జరుగనున్నాయి.