18.9.25

TTD Vigilance, Police Co-Ordination Meeting on Security Arrangements During Brahmotsavams Held




In the backdrop of the Srivari Salakatla Brahmotsavams to be held from September 24 to October 02, a coordination meeting was held with TTD Vigilance and Security, District Police officials along with TTD HoDs under the chairmanship of TTD CVSO Sri Muralikrishna at Annamayya Bhavan in Tirumala on Wednesday.

Highlights of the meeting

•  Crowd movement tracking through command control system.

•  Arrangement of parking lots without traffic disruption.

•  Steps to monitor congestion points 

•  Planned actions without disruption to vehicular movement on the ghat road.

. Checking the strength of electrical cutouts and LEDs 

•  Checking the stability of vahanams used for  Brahmotsavam.

•  Checking the identity of workers and drivers visiting Tirumala during Brahmotsavam.

TTD CE Sri Satyanarayana, Additional SP Sri Ramakrishna, TTD and district police officers participated in this meeting.

బ్రహ్మోత్సవాల్లో భద్రతపై టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయ సమావేశం brahmotsavams





సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో బుధవారం సాయంత్రం సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవలలో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై చర్చించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
•  ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల మరియు తిరుపతిలలో పార్కింగ్ లు ఏర్పాటు- 
•  ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు.
•  ఎలక్ట్రికల్ కటౌట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల పటిష్టత తనిఖీ.
•  బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం మరియు దృఢత్వం పరిశీలన.
•  బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే  కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ.
•  అధిక రద్దీ నేపథ్యంలో ముందస్తుగా అదనపు వాహనాల పార్కింగ్ ఏర్పాటు పై ప్రణాళిక 
•  టీటీడీ నిఘా, జిల్లా పోలీసు,  టిటిడి అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు 
ఈ సమావేశంలో టీటీడీ సిఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, టీటీడీ విభాగాధిపతులు, జిల్లా పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Trail Run of Surya Prabha Vahanam




TTD officials conducted a trial run of the Surya Prabha Vahanam, which is to be used during the annual Srivari Brahmotsavams, on Wednesday to examine its stability and sturdiness.

The officials also inspected the precautions to be taken by the vahanam bearers during the procession.

Temple Dy EO Sri Lokanatham, and other officials participated in this program.

సూర్యప్రభ వాహనం ట్రయల్ రన్ surya prabha vahanam




శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సూర్యప్రభ వాహనం పటిష్టతను పరిశీలించేందుకు బుధవారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పాల్గొన్నారు.

Pavitra Pratista at Appalayagunta




As part of the ongoing annual Pavitrotsavams, the sacred ritual of Pavitra Pratishtha was performed with religious fervour at the Sri Prasanna Venkateswara Swamy Temple in Appalayagunta on Wednesday.


On Friday, September 19, Abhishekam will be performed in Ekantam (private) to Sri Prasanna Venkateswara Swamy, Sri Padmavathi Ammavaru, and Sri Andal Ammavaru. 

Deputy EO Sri Harindranath, temple staff, and a large number of devotees participated in these spiritual events.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట pavitra pratista




అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు.

సాయంత్రం శ్రీవారిని తిరుచ్చి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
18వ తేదీ గురువారం స్వామి వారికి  పవిత్ర సమర్పణ చేపడుతారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడుతారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 
19వ తేదీ గురువారం ఉదయం ఏకాంతంగా శ్రీవారికి, శ్రీ పద్మావతీ అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి అభిషేకం చేస్తారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తర్వాత స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం శ్రీవారి తిరువీధి ఉత్సవం, రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి, కుంభబింభం వేంచేపు, కళవాహన విశేష నివేదన, అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. 
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకుల, భక్తులు పాల్గొన్నారు.

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు Dec quota




డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు.
ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.
22న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
శ్రీవాణి దర్శన కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…
తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.