17.3.26

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam






తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపితోమాలసహస్రనామార్చన చేశారుసాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారురాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవంమేదినీపూజమృత్సంగ్రహణంశాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్న‌ జీయర్ స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగరత్నఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌ఇతర అధికారులు పాల్గొన్నారు.


మార్చి 17 ధ్వజారోహణం :


మంగ‌ళ‌వారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష ల‌గ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయిఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారుధ్వజపటముచక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుందిఅనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద– టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి annamayya




శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తితాత్వికతమానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వమైన సాహిత్య సంపదగా నిలిచాయని టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి తెలిపారుఅన్నమయ్య 523 వర్థంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి.


 సందర్భంగా శ్రీ కృష్ణమూర్తి “అన్నమయ్య కవితా రామణీయకం” అనే అంశంపై మాట్లాడుతూశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కవిత్వం మాధుర్యంసరళతభావగాంభీర్యంతో తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిందన్నారుఆయన సంకీర్తనల్లో భక్తి భావంతో పాటు కవితా సౌందర్యంసులభమైన పదజాలంమధురమైన లయలోతైన ఆధ్యాత్మిక తాత్వికత సమన్వయంగా కనిపిస్తాయని చెప్పారుభావపూర్ణమైన పదప్రయోగం, అలంకారాల వినియోగంసంగీతానికి అనుకూలమైన కవితా నిర్మాణం అన్నమయ్య కవితా రామణీయకానికి ప్రధా లక్షణాలని వివరించారు.


అనంతరం విజయవాడకు చెందిన ఆచార్య నిర్మల “అన్నమయ్య రచనా వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తూశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు క్తి సాహిత్యంలో అజరామరమైన స్థానం సంపాదించిన మహాకవి అని పేర్కొన్నారుశ్రీ వేంకటేశ్వర స్వామివారిపై రచించిన వేలాది సంకీర్తనల్లో భక్తితత్వంమానవీయ విలువలుసామాజిక స్పృహ సమన్వయంగా ప్రతిఫలిస్తాయని తెలిపారుభక్తి భావంతో పాటు జీవిత సత్యాలునైతిక విలువలను ఆయన సంకీర్తనల్లో చక్కగా ప్రతిబింబించారని చెప్పారు.


తదుపరి ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య సర్వోత్తమరావు “అన్నమయ్య సంకీర్తనల్లో మానవీయ సంబంధాలు” అనే అంశంపై మాట్లాడుతూఅన్నమయ్య కీర్తనల్లో తల్లిబిడ్డల అనుబంధంభర్తభార్యల ప్రేమగురుశిష్య సంబంధంభక్తుడుభగవంతుడి అనుబంధం వంటి అనేక మానవీయ సంబంధాలను ఎంతో హృద్యంగా చిత్రించారని చెప్పారుసాధారణ జీవితంలో కనిపించే అనురాగంకరుణదయ వంటి విలువలను యన సంకీర్తనల ద్వారా తెలియజేశారని పేర్కొన్నారుఅందువల్ల అన్నమయ్య సంకీర్తనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాకుండా మానవ సంబంధాల సౌందర్యాన్ని ప్రతిబింబించే సాహిత్య రత్నాలుగా నిలిచాయని తెలిపారు.


తర్వాత తిరుపతికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం “సామాజిక చైతన్య శీల అన్నమయ్య” అనే అంశంపై ప్రసంగించారు.


సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం సంగీత కార్యక్రమంరాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విశాఖపట్నానికి చెందిన శ్రీమతి ప్రశాంతి బృందం వీణా వాయిద్య కార్యక్రమం నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్సంచాలకులు శ్రీమతి లతఇతర అధికారులుపురప్రజలు పాల్గొన్నారు.


Koil Alwar Tirumanjanam Performed at Sri Govindaraja Swamy Vari Temple






Koil Alwar Thirumanjanam was performed as per temple traditions at the Sri Govindaraja Swamy Temple in Tirupati on Monday morning in view of the Ugadi Asthanam festival to be observed on March 19.


As part of the ritual, the Lord was awakened with Suprabhatam in the early hours, followed by Thomala Seva and Sahasranamarchana. Later, from 7 a.m. to 9 a.m., the temple premises including the sanctum of Sri Govindaraja Swamy, Sri Parthasarathi Swamy, Sri Andal Ammavaru, Sri Kalyana Venkateswara Swamy, and Sri Pundarikavalli Ammavaru were thoroughly cleaned.


After cleansing the temple premises, holy water mixed with fragrant ingredients such as Namakoppu, Srichurnam, kasturi turmeric, pachhaaku, camphor, sandalwood powder, kumkum and other sacred materials was sprinkled throughout the temple.

Devotees were allowed for Sarva Darshan from 9:30 a.m.


Temple Deputy Executive Officer Smt. Shanthi, AEO Sri Narayana Chowdary, Superintendent Sri Chiranjeevi, along with the temple priests, participated in the programme.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం sri govindaraja swmay vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 19 తేదీ ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.


ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవస‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వహించారుత‌రువాత ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిశ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధిశ్రీ ఆండాల్‌ అమ్మవారుశ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిశ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారుఅనంతరం ఉద‌యం 9.30 గంట‌ల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతిఏఈవో శ్రీ నారాయ‌ణ చౌద‌రిసూపరింటెండెంట్‌ శ్రీ చిరంజీవిఅర్చక బృందం పాల్గొన్నారు.

16.3.26

Ustad Bhagat Singh Movie Actress Rashi Khanna Press meet