24.5.26

మే 24న వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam




నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8.15 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పవిత్ర కార్యక్రమం జరుగనుంది.


మే 28 నుండి జూన్ 5 తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పవిత్రత, శోభను మరింత పెంపొందించే ఉద్దేశంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.


సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి జలాలతో పరిశుభ్ర్రం చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.


కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.


మిథున లగ్నంలో దివ్యంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams







వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.35 నుండి 8.49 గంటల మధ్య గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.


అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమే శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు వెండి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. దివ్య ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ర్పాట్లను స్వామివారే స్వయంగా ర్యవేక్షిస్తారనే ఆధ్యాత్మిక విశ్వాసం భక్తులను అలరించింది.


అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.


తదనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో భిషేకాలు నిర్వహించగా భక్తులు క్తి పరవశులయ్యారు.


సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనసేవ వైభవంగా జరుగనుంది. పెద్దశేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్‌, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, ఆకర్షణీ పెయింటింగ్స్‌, పుష్పాలంకరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మి శోభతో తీర్చిదిద్దింది.


అదేవిధంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, శ్రీ రంజిత్ , అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Records Highest Ever Darshan Figures of 87,689 on May 22nd






Proving its stand on giving the highest priority to the common devotees’, TTD has achieved a new milestone providing darshan to 87, 689 devotees on May 22, which is highest ever on Fridays so far in the History of TTD.


Despite the heavy rush and hectic schedule of temple rituals on Friday, through meticulous coordination, planning and special arrangements, TTD registered a ''Fantastic Friday''. 


Another significant achievement is that  5,850 common devotees were provided  darshan during the Abhisheka Seva of the presiding deity of Sri Venkateswara Swamy with which the dream of once in a life time ambition of thousands of common devotees fulfilled. 


The devotees expressed their overwhelming excitement on having this rarest 'Darshan'.


In view of the ongoing summer vacation rush, under the instructions of Higher Authorities, all the departments of TTD are working in close coordination to ensure that devotees visiting Tirumala do not face any inconvenience and have a smooth Darshan.

టీటీడీకి రూ.30 లక్షలు విరాళం donation




టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.30 లక్షలు విరాళంగా అందింది.


తిరుపతికి చెందిన శ్రీమతి కోరా సౌమ్య  రూ.10,00,116, శ్రీ బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి రూ.10,00,116, శ్రీ పూరాబ్ సాయి రూ.10 లక్షలు ట్రస్టుకు అందజేశారు.


మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ, చెక్కులను అందజేశారు.


శ్రీవారి అభిషేక వేళ సామాన్య భక్తులకు దివ్య దర్శన భాగ్యం friday darshanam





భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ శుక్రవారం నిర్వహించే శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించింది.


శుక్రవారం రోజున ఆలయంలో  టీటీడీ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చరిత్రలో శుక్రవారం రోజున ఇంత భారీ సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.


సామాన్య భక్తునికి అభిషేక సేవ వీక్షణం - జన్మ సాఫల్యం 


ప్రత్యేకించి శ్రీవారి అభిషేక సే కొనసాగుతున్న సమయంలోనే మే 22 సుమారు  5850 మంది సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది.


ప్రతి శుక్రవారం ఉదయం వివిధ ద్రవ్యాలతో చేసే ఎంతో ఉత్కృష్టమైన అభిషేక సేవను జీవితంలో ఒకసారైనా వీక్షించాలని శ్రీవారి భక్తులు కలలుకంటారు


కలను సాకారం చేస్తూ సామాన్య క్తులకు అభిషేక సేవ సమయంలో టీటీడీ అత్యధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడంతో వారు ఆనందంతో పరవశించారు.


వివిధ విభాగాల సమన్వయం మరియు సమిష్టి కృషి :


మరోవైపు భక్తుల రద్దీ అధికంగా న్నప్పటికీ, క్యూలైన్ల నిర్వహణ, దర్శన సమయ సమన్వయం, అన్నప్రసాదాల పంపిణీ, తాగునీటి సదుపాయాలు తదితర అంశాల్లో టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు


శ్రీవారి కైంకర్యాలు కొనసాగుతున్నప్పటికీ సామాన్య భక్తులకు నిరంతర దర్శన సౌకర్యం కల్పించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని అందించారు.


కాగా వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. టీటీడీ అధికారులు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తుల  కోసం విశేషంగా శ్రమిస్తున్నారు.

Chief Pontiff Sri Krishnapura Mutt Udupi Offered Prayers to Lord Venkateswara







26: HH Sri 108 Sri Vidya Sagara Teertha Swamiji of Sri Krishnapura Mutt, Udupi offered prayers to Lord Venkateswara in Tirumala on Saturday morning. On his arrival in front of Sri Vari Temple, Addl EO Sri Ch. Venkaiah Chowdary and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.

TTD Board Member Sri Naresh, Temple DyEO Sri Lokanadham, Temple Peishkar Sri Ramakrishna and others were present.

23.5.26

రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa| https://youtu.be/cOjjvoF9gaY


రుచికర అటుకులపిండి హల్వా |Grandma's Style Traditional PohaFlour Halwa|

https://youtu.be/cOjjvoF9gaY