30.1.26

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి జత కర్ణపత్రముల బహుకరణ ear ornaments




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన శ్రీ కె. దీపక్ గురువారం ఉదయం 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు.


దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టిటిడి అధికారులకు దాత అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments