6.2.26

ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24వ తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు tondamanpuram




తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 15న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 16న ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంట‌ల‌కు శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 17న హంస వాహనం, ఫిబ్ర‌వ‌రి 18న సింహ వాహనం, ఫిబ్ర‌వ‌రి 19న హనుమంత వాహనం, ఫిబ్ర‌వ‌రి 20న సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ అత్యంత వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.


ఫిబ్ర‌వ‌రి 21న గజవాహనం, ఫిబ్ర‌వ‌రి 22న చంద్రప్రభ వాహనం, ఫిబ్ర‌వ‌రి 23న ఉదయం తిరుచ్చి, రాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 24న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.


No comments :
Write comments