20.4.26

ఏప్రిల్ 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం padmavati amamvari temple



తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల


యంలో ఏప్రిల్ 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. వ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వస్తోంది.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.  నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9. 30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  


ఈ కార‌ణంగా ఏప్రిల్ 28న క‌ల్యాణోత్స‌వం , సహ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


No comments :
Write comments