24.4.26

ఏప్రిల్ 28న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం veda narayanaswamy vari temple




నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 1 నుండి 9 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముందు ఈ కార్యక్రమం ఆనవాయితీగా చేపడతారు.


అదే రోజు తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల సేవ, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.


ఈ సందర్భంగా ఆలయం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

మధ్యాహ్నం 1 గంట నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

No comments :
Write comments