2.8.26

ఆగ‌స్టు నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavari temple




తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మ‌రియు అనుబంధ ఆల‌యాల‌లో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో....

-  ఆగ‌ష్ఠు 7, 14, 28వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.  

•  ఆగ‌ష్ఠు 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంట‌ల‌కు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

-    ఆగ‌ష్ఠు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి లయంలో ...

-  ఆగ‌ష్ఠు 8న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో...

-    ఆగ‌ష్ఠు 3, 30వ తేదీల‌ల్లో న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు. 

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...

-   ఆగ‌ష్ఠు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం...

ఆగష్ఠు 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....

-   ఆగ‌ష్ఠు 4న తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.

-   ఆగ‌ష్ఠు 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

-   ఆగ‌ష్ఠు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

-   ఆగ‌ష్ఠు 26న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణోత్స‌వం.

-   ఆగ‌ష్ఠు 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

No comments :
Write comments