తిరుమలలో
భక్తుల అనూహ్య రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూలైన్లలోని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. అంతే కాకుండా 12వ తేది నుండి 14వ తేది వరకు వరుస సెలవుల రానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.ఈ కారణంగా 13వ తేది ఆదివారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. అంటే 12వ తేది శనివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఆదివారం నాడు రద్దు చేయబడిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు వినియోగించడం జరుగుతుంది.
ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
No comments :
Write comments