24.9.26

24న భాగ్ సవారి ఉత్సవం festivals


తిరుమలలో సెప్టెంబర్ 24 తేది సాయంత్రం భాగ్‌ సవారి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమా వీధులలో విహరిస్తూ అనంతాళ్వారు తోటకు వేంచేస్తారు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూెత్సవాలు పూర్తయిన మరుసటిరోజు తిరుమలలో ”భాగ్‌ సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


25న అనంత పద్మనాభ వ్రతం-చక్రస్నానం


తిరుమలలో సెప్టెంబ‌రు 25వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.


ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా  పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.


అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి, చక్ర స్నానం నిర్వహించి, తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.


26 పౌర్ణమి గరుడసేవ 


తిరుమలలో సెప్టెంబరు 26వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. 


ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.


No comments :
Write comments