తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలకు సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించారు.
టీటీడీ ఇన్‌చార్జి సీఈ శ్రీ మనోహరం, ఇంజినీరింగ్ పనుల పురోగతిని అదనపు ఈవోకు వివరించారు. శ్రీవారి ఆలయం, మాడ వీధులు, గ్యాలరీల్లో వైట్‌వాషింగ్, పెయింటింగ్, బారికేడింగ్, మరమ్మతులు, అభివృద్ధి పనులు, పుష్కరిణి గ్రిల్స్ పునరుద్ధరణ, వాహనాల ఫిట్‌నెస్, వివిధ డ్యామ్‌లలో నీటి నిల్వల స్థాయి, విద్యుత్ అలంకరణ, వివిధ విశ్రాంతి భవనాల్లో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ తదితర పనులు దాదాపు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు.
బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సివిల్ ఇంజినీరింగ్ పనులన్నింటినీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.
అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి సంబంధించిన పనుల పురోగతిని కూడా అదనపు ఈవో సమీక్షించారు.
ఈ సమావేశంలో ఎస్‌ఈలు శ్రీ వేణుగోపాల్, శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈలు శ్రీ శ్రీనివాసులు, శ్రీ సుధాకర్, డిఈ శ్రీ చంద్రశేఖర్ తదితర ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments