శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం తిరుమలలోని నాదనీరాజనం, ఆస్థాన మండపంలలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ బి.కేశన్న, శ్రీ ఈ.నాగరాజు బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు సికింద్రాబాద్ కు చెందిన డాక్టర్ జయప్రద రామ్మూర్తి బృందం వేణుగానం భక్తులను అలరించింది.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్.అనిత బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి డాక్టర్ రమాప్రభా యర్రంపల్లి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు వారణాసికి చెందిన ఆచార్య బి.విశ్వనాథ్ భక్తి సందేశం అందించారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ సి.బాల సుబ్రహ్మణ్యం బృందం అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి.
సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి బృందం హరికథ గానం చేశారు.

.jpg.jpeg)
No comments :
Write comments