20.9.26

సింగపూర్‌ కళాకారుల సీతారామ కళ్యాణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ classic dances






తిరుమలలో నివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి.


సింగపూర్‌ కళాకారుల తొలి ప్రదర్శన


గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శన మార్గం


సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించుకునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు.


15 రకాల ఆహార పదార్థాలు, పానీయాలు


గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో 8 రకాల ఆహార పదార్థాలు, 7 రకాల పానీయాలు ఉన్నాయి.


24 లక్షల సర్వింగ్స్‌కు అన్నప్రసాదం ఏర్పాట్లు


భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్‌ అందించేలా ఏర్పాట్లు చేసింది.


గరుడసేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు తదితర సౌకర్యాలను అందించింది.


No comments :
Write comments