22.9.26

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ cutural programmes



శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుప‌తిలో సోమవారం టీటీడీ ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.


ఇందులో భాగంగా తిరుప‌తిలోని మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల బృందం భక్తి సంగీతం, 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల లెక్చరర్ శ్రీ పి.రవి సుబ్రహ్మణ్యం బృందం భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విష్ణుప్రియ భరద్వాజ్ బృందం భక్తి సంగీతం నిర్వ‌హించారు. 7.30 నుండి 8.30 గంటల వరకు చెన్నైకు చెందిన నృత్యమాల అకాడమీ ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కడపకు చెందిన శ్రీ కొండపల్లి ఉదయ్ కుమార్ బృందం హరికథ గానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

No comments :
Write comments