వైఎస్‌ఆర్
జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫణ నిర్వహించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, అంకురార్పణ జరిగింది.
సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్ఠార్చన, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు.
సెప్టెంబరు 25వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 26న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఆలయంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించనున్నారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
No comments :
Write comments