ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని కారీరిష్టి, వరుణ జపం, పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దివ్య అనుగ్రహంతో భారతదేశవ్యాప్తంగా సకాలంలో సస్యానుకూలమైన వర్షాలు కురిసి, అతివృష్టి, అనావృష్టి బాధలు లేకుండా ప్రజలందరూ మంచి పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి ఈ యాగాలను నిర్వహించినట్లు తెలిపారు.
గత ఐదు రోజులుగా 32 మంది ఋత్వికులతో కారీరిష్టి సహిత వరుణ జపం, పర్జన్యశాంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి, మహాపూర్ణాహుతితో సంపూర్ణం చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments :
Write comments