23.9.26

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు సేవలు అద్భుతం ttd addl eo




శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు అద్భుతమైన సేవలు అందించారని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కొనియాడారు.


తిరుమలలోని సేవా సదన్-2 లోని సత్సంగం హాలులో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లతో మంగళవారం ఉదయం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సేవల పట్ల భక్తులందరూ ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. గరుడసేవ సందర్భంగా మాడ వీధుల్లోని భక్తులకు అన్న పానీయాలు, తాగునీటి పంపిణీలో శ్రీవారి సేవకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. శ్రీవారి సేవకుల సేవలను పర్యవేక్షించిన గ్రూప్ సూపర్వైజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇదే ఉత్సాహంతో రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా తమ అత్యుత్తమ నిస్వార్ధ సేవలు అందించాలని కోరారు. 


సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి చిన్ని అసౌకర్యం కూడా కలగకుండా సేవలు అందించిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.


అనంతరం శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లు వివిధ ప్రాంతాల్లో తాము సేవా విధులు నిర్వహిస్తున్న సమయంలో తమ feedback ను అందించారు.


ఈ సమావేశంలో టీటీడీ సీపీఆర్వో, శ్రీవారి సేవా విభాగం అధిపతి డాక్టర్ టి.రవి, పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవా విభాగం సిబ్బంది, దాదాపు 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు(వీరిలో తొలిసారి సింగపూర్, ఆఫ్రికా దేశాలకు చెందిన NRI లు), తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments