శ్రీవారి ఆలయం నుంచి గ్యాలరీలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖల వారీగా పటిష్టమైన సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలపైతక్షణస్పందన
ముఖ్యంగా వైద్యం, అన్నప్రసాదాలు, పోలీసు, పారిశుధ్యం, విజిలెన్స్, శ్రీవారి సేవ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అత్యవసర వైద్య సేవలు తదితర విభాగాల అధికారులు గ్యాలరీల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తుల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడంతో పాటు, అవసరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తక్షణమే తీసుకురావాలని ఆదేశించారు.
భక్తులతోఈవోముఖాముఖి
అనంతరం గ్యాలరీల్లోని భక్తులతో ఈవో స్వయంగా మాట్లాడి అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, శ్రీవారి సేవకుల సేవలు, టీటీడీ సిబ్బంది అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అందిస్తున్న శుద్ధి చేసిన జలప్రసాదాన్ని పరిశీలించారు.
టీటీడీసౌకర్యాలపైభక్తులసంతృప్తి
తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్, అనంతపురం, నాందేడ్, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments