3.10.26

గోవింద నామస్మరణతో అక్టోబర్ 03న పిండి దీప మహోత్సవం pindi deepa utsavam





అక్టోబర్ 03వ తేదీ శనివారం ఉదయం 7.30 గంటలకు నిర్వహించనున్న పిండి దీప మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్ అధికారులను ఆదేశించారు.


టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 


టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద నామస్మరణతో పాదయాత్ర సాగనుంది.


ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.


పిండి దీపంలో నెయ్యితో జ్యోతిని వెలిగించి, గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ మహోత్సవ ప్రత్యేకత. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించడం, భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.


భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని, సనాతన ధర్మ వైభవాన్ని భావితరాలకు అందించాలని టీటీడీ జేఈవో విజ్ఞప్తి చేశారు.


అంతకుముందు టిటిడి పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానం, అలిపిరి పాదాల మండపం వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం జేఈవో పరిశీలించారు. 


ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్ ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, డీఈ శ్రీమతి సరస్వతి, ఎస్వీబీసీ సిపివో శ్రీ, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 


No comments :
Write comments