కుప్పం
విలజాపురం రోడ్డు, కుప్పం చెరువు కట్ట సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవ ప్రాంగణంలో అక్టోబరు 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీపపూజకు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా.ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన కుప్పంలో జరుగుతున్న ఏర్పాట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు.
భక్తులకు పటిష్ట సౌకర్యాలు
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ మహాలక్ష్మీ దీపపూజలో పాల్గొనే భక్తుల కోసం తగిన సంఖ్యలో షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం, వి.కోట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో దీపపూజలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
దీపపూజకు తరలివచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జేఈవో సూచించారు. పోలీసు, మున్సిపల్, టీటీడీ సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దీపపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ శ్రీకాంత్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారం, సీఈ శ్రీ మనోహరం, విజీఓ శ్రీ గిరిధర్, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డా. సునీల్, డీఈ (ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ శ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments