3.10.26

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 appalayagunta temple




మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది.


తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందజేశారు.


రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాంధీ జయంతి సందర్భంగా ఆలయాలు, ధార్మిక సంస్థల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రదానం చేస్తోంది. 


ఇందులో భాగంగా ఈ ఏడాది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఈ పురస్కారం లభించింది.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయ సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments