30.10.26

నవంబర్ 4వ తేది వరకు ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ sv museum



తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సందర్శన ట్రయల్ రన్ నవంబర్ 4వ తేది వరకు కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతిలో పని చేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ మరియు ఇతర విద్యా సంస్థలకు , చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరిగుతుంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. 

No comments :
Write comments