అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేపట్టారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 45 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో డా ఎ శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఆలయ అర్చకులు శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ వేణుగోపాల్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments