టీటీడీ
రవాణా విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ శుక్రవారం సాయంత్రం తిరుమల డిపోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జీఎం శ్రీ పి.రాము, డీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, పలువురు విభాగాధిపతులు, తిరుపతి-తిరుమల డిఐ లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ఉన్న దాదాపు 161 వాహనాలకు వివిధ పుష్పాలు, తోరణాలతో అలంకరించి ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.
శ్రీవారి నమూనా విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.
No comments :
Write comments