డిసెంబరు 5న అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుచానూరులోని ఆలయం, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూలైన్లు, పుష్కరిణి, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఆయన పరిశీలించారు.
భక్తులసౌకర్యాలకుప్రాధాన్యం
బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం, లడ్డూ, టికెట్ కౌంటర్లను పద్ధతిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా గరుడ వాహనం, గజ వాహనం, పంచమి తీర్థం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
విద్యుత్, పుష్పాలంకరణలతోవైభవంగాఉత్సవాలు
విజిలెన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పక్కా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలయం, వాహన మండపం, మాడ వీధుల్లో ఆకర్షణీయమైన విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని, వారంలోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ సెల్వం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments