Everything related to news...
శ్రీవారి ఆలయం ఎదుట నృత్యం చేస్తూ రీల్స్ చిత్రీకరించిన ఘటనపై తక్షణమే స్పందించిన టీటీడీ సదరు వ్యక్తులపై తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమైనది. ఘటన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగింది.
ఆలయ పరిసరాలు మరియు మాడ వీధుల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణ పూర్తిగా నిషేధం. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
భక్తులు కూడా ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
No comments :
Write comments