తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన సింహ వాహనసేవలో కళారూపాలను ప్రదర్శించిన కళాకారులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా వివిధ కళాబృందాలు ప్రదర్శించిన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ప్రత్యేకంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు:
• ఒడిశా: DSP ఆధ్వర్యంలో మహారి, ఒడిస్సీ, మణికర్ణిక నృత్యాలు – 28 మంది కళాకారులు.
• విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్: ఎస్వీసీఎండీ ఆధ్వర్యంలో శ్రీమతి పి. శైలజారెడ్డి బృందం ప్రదర్శించిన ‘దశావతారాలు’ – 39 మంది కళాకారులు.
• కర్ణాటక: హలక్కి సుగ్గి కునిత జానపద నృత్యం – హరీష్ బృందం, 25 మంది కళాకారులు.
• మహారాష్ట్ర: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డ్రమ్స్, యోగ్ చాప్ ప్రదర్శనలు – ఎం.జి. కాథేకర్ బృందం, 75 మంది కళాకారులు.
వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల వైభవాన్ని చాటిచెప్పాయి.
No comments :
Write comments