శ్రీవారి న
వరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమతి బి.లక్ష్మీ సువర్ణ, శ్రీ జి.చంద్రశేఖర్ బృందం మంగళధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద వేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం అందించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ వేంకట నాగరాజన్ కృష్ణమూర్తి బృందం నామ సంకీర్తన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం 5 నుండి 6:30 గంటల వరకు శ్రీ బి.ఆర్.వి.ఎస్ పవన్ కుమార్, శ్రీ చరణ్ శ్రీ బి.ఏ.నారాయణ, శ్రీ సంతోష్ కిరణ్ బృందం అన్నమయ్య సంకీర్తన లహరి కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విజయలక్ష్మీ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల లెక్చరర్ శ్రీ కె.సుధాకర్ బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చోడవరానికి చెందిన శ్రీ సుదర్శనమ్ సీతారామాచార్యులు బృందం భక్తి సందేశం ధార్మికోపన్యాసం ఇచ్చారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి జె.మాధవికృష్ణ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు కడపకు చెందిన శ్రీ వై.రమేష్ బాబు బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి స్వామివారి భక్తిలో మునిగిపోయారు.
No comments :
Write comments