శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఇ.మునికన్నయ్య తబలా వాద్య తరంగి కార్యక్రమం ఆకట్టుకుంది. 7:30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సి.సంధ్య బృందం భరతనాట్య ప్రదర్శన సభను భక్తి సాగరంలో ముంచెత్తింది.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీమతి సంధ్యా శ్రీనాధ్ బృందం భక్తి సంగీత కార్యక్రమం పుర ప్రజలను విశేషంగా అలరించింది.
శ్రీ కోదండరామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీమతి ఎ.హైమ బృందం భక్తి సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమాల్లో సంగీత, నృత్యాభిమానులు, భక్త జనులు పెద్ద సంఖ్యలో తిలకించి ఆనంద పరవశులయ్యారు.


No comments :
Write comments