సోమవారం తిరుమలలోని రాంభగీచా-2 మీడియా సెంటర్లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
హిందూధర్మప్రచారపరిషత్, అన్నమాచార్యప్రాజెక్టు
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ, వార్షిక బ్రహ్మోత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల కళాబృందాలతోపాటు సింగపూర్, జర్మనీకి చెందిన ప్రవాస భారతీయ కళాకారులు కూడా తమ ప్రతిభను చాటారని తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఖతార్, దుబాయ్, ఆస్ట్రేలియా నుంచి వచ్చే కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో భక్తులను అలరించనున్నారని చెప్పారు.
అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 40 కళాబృందాలకు చెందిన 1,200 మంది కళాకారులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 31 బృందాలకు చెందిన 781 మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
దాససాహిత్యప్రాజెక్టు
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. పి.ఆర్. ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ, బ్రహ్మోత్సవాల్లో కళాసేవ అందిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 39 బృందాలకు చెందిన సుమారు 1,000 మంది కళాకారులు వాహన సేవల సమయంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు.
శ్రీవేంకటేశ్వరసంగీత, నృత్యకళాశాల
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల మాట్లాడుతూ, 1959లో ప్రారంభమైన ఈ కళాశాల భారతీయ సాంప్రదాయ కళల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందన్నారు.
కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ గాత్ర సంగీతం, వాద్య సంగీతం, హరికథ తదితర కళారంగాల్లో ఎంతోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని తెలిపారు.
ప్రస్తుతం 13 కళారంగాల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళాశాల విద్యార్థులకు చెందిన 59 బృందాల్లోని సుమారు 1,500 మంది తమ కళాప్రదర్శనలతో భక్తులను అలరించనున్నారని వివరించారు.
ఈ సమావేశంలో టీటీడీ పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ పాల్గొన్నారు.
No comments :
Write comments