21.10.26

అశ్వ వాహనసేవలో అలరించిన జాతీయ కళారూపాలు folk art forms




తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన అశ్వ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సత్కరించారు.

ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కళారూపాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. భరతనాట్యం – తిరుపతి

ఎస్వీసీఎండీ ఆధ్వర్యంలో శ్రీ పి. రవి సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది.

2. మంబూ డ్యాన్స్ – మిజోరాం

హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీమతి నాబామల్లిక భగవతి బృందం ప్రదర్శించిన మంబూ నృత్యం అలరించింది.

3. కవరా డ్యాన్స్ – ఉత్తరప్రదేశ్

వారణాసికి చెందిన డాక్టర్ దివ్య శ్రీవాస్తవ బృందం ప్రదర్శించిన కవరా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

4. శ్రీనివాస పరిణయం – కర్ణాటక

దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిబాని ఎస్. జోషి బృందం ప్రదర్శించిన శ్రీనివాస పరిణయం నృత్యరూపకం భక్తులను ఆకట్టుకుంది.

భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ కళలు, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల కళాకారులకు వేదిక కల్పిస్తూ, భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించేలా టీటీడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

No comments :
Write comments