27.10.26

వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి అన్నాభిషేకం kapileswaraswamy varu




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం అన్నాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నంతో అలంకరించిన పరమశివుని దర్శించుకునే పవిత్ర అవకాశం భక్తులకు కల్పించారు.

శాస్త్రోక్తంగా అభిషేకాది కార్యక్రమాలు

ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, అన్నాభిషేకం, దీపారాధన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు.

దర్శనం అనంతరం ఏకాంతంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించి, అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ శుద్ధి చేపట్టి, సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం నిర్వహించి, అదే సమయంలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments